ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏడుగురు ఓటర్ల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రం..ఏడుగురు సిబ్బంది - విజయనగరం జిల్లాలో కేవలం ఏడుగురు ఓటర్ల ప్రత్యేక పోలింగ్ కేంద్రంకోసం

విజయనగరం జిల్లాలో కేవలం ఏడుగురు ఓటర్ల కోసం అధికారులు ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పర్యవేక్షణకు ఏడుగురు సిబ్బందిని సైతం నియమించారు.

special polling station for seven voters in vizianagaram district
ఏడుగురు ఓటర్ల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రం

By

Published : Mar 5, 2021, 9:53 PM IST

విజయనగరం జిల్లా సాలూరు పట్టణం పురపాలక ఎన్నికల కోసం మొత్తం 49 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ అధికారులు జాబితా విడుదల చేశారు. స్థానిక 4వ వార్డు హరిజన పేట పరిధిలోని కాలనీలో కేవలం ఏడుగురు ఓటర్లు మాత్రమే ఉండగా.. వారి కోసం ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల పర్యవేక్షణకు ఏడుగురు సిబ్బందిని నియమించారు. ఇది సమస్యాత్మక కేంద్రం కావటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details