విజయనగరం జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో మెుత్తం ఐదు ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. విజయనగరం కార్పొరేషన్‌తో పాటు సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని ఎస్పీ రాజకుమారి తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ గుమికూడకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకున్నామన్నారు.
ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్ - విజయనగరంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్
రాష్ట్రవ్యాప్తంగా 12 నగరపాలక, 71 పురపాలక, నగర పంచాయతీల్లో పోలింగ్ ముగిసింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భద్రత సిబ్బందిని నియమించి పోలింగ్ నిర్వహించారు. విజయనగరం కార్పొరేషన్‌తో పాటు సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీలో పోలింగ్ ప్రశాంతంగా సాగింది.
ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్