ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జిల్లాలో మరిన్ని మోడల్ పోలీస్​స్టేషన్ల నిర్మాణం' - ఎస్పీ దామోదర్

బొబ్బిలి గ్రామీణ పోలీసు కార్యాలయాన్ని ఎస్పీ దామోదర్ ప్రారంభించారు. జిల్లాలో మరిన్నీ మోడల్ పోలీస్ స్టేషన్లు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎస్పీ అన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల భద్రతను సమర్థవంతంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

జిల్లాలో మరిన్నీ మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం : ఎస్పీ దామోదర్

By

Published : Jun 5, 2019, 5:20 PM IST

జిల్లాలో మరిన్నీ మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం : ఎస్పీ దామోదర్

విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామీణ పోలీసు కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఎస్పీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో మద్యం గొలుసు దుకాణాలను పూర్తిగా తొలిగిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో మరికొన్ని మోడల్ పోలీస్ స్టేషన్లు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి అదనపు ఎస్పీ గౌతమి శాలి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details