ఉత్తరాంధ్ర అభివృద్ధి భాజపాతో మాత్రమే సాధ్యమని... ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా పార్వతీపురం లైన్స్ కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఉత్తరాంధ్ర...కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీ పాలనలో నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. దివంగత నందమూరి తారక రామారావు పాలనలో తన దైన ముద్ర వేసుకున్నారని అన్నారు.
రాష్ట్రంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజల కోసం మంచి పాలన కోసం ఆలోచన చేస్తున్నారని అన్నారు. వీర్రాజు, సునీల్ దియోధర్ చేతుల మీదగా పేదలకు చీరలు పంపిణీ చేశారు. అలాగే జనసేన నాయకులు భాజపా నాయకులకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ దియోధర్ , ఎమ్మెల్సీ మాధవ్ అధ్యక్షతన పార్వతీపురం పురపాలక సంఘ మాజీ కౌన్సిలర్లు డి శ్రీనివాసరావు జ్యోతితో పాటు... పలువురు యువకులు భాజపాలో చేరారు.