ధర్మయాత్రలో భాగంగా రామతీర్థం వెళ్లిన సోము వీర్రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామతీర్థం యాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకోవడం సరికాదని ఆయన మండిపడ్డారు. హిందూ ఆలయాలపై దాడులను నియంత్రించాలని కోరారు. ఘటనలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ వెల్లంపల్లి రాజీనామా చేయాలని సోము వీర్రాజు పేర్కొన్నారు.
రామతీర్థానికి నేను వెళ్తే తప్పేంటి?: సోము వీర్రాజు - somu verraju arrested news
కోదండ రాముని విగ్రహం ధ్వంసం ఘటనపై 'భాజపా- జనసేన' తలపెట్టిన రామతీర్థ ధర్మయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రామతీర్థానికి నేను వెళ్తే తప్పేంటి?: సోము వీర్రాజు