విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పనుకువలస పంచాయతీ కందిరివలస గ్రామానికి చెందిన కోన లక్ష్మణరావు వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. లాక్ డౌన్ నిబంధనలు గురించి ఇంటింటికీ వెళ్లి తెలియజేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గాదిపల్లి సన్యాసిరావు అనే వ్యక్తి వీధుల్లో తిరుగుతుండగా...లక్ష్మణరావు ఇంట్లో ఉండమని సూచించాడు. దీంతో రెచ్చిపోయిన సన్యాసిరావు అతని పై అసభ్యకరవ్యాఖ్యలు చేశాడు. ఊరి పెద్దలు నచ్చచెప్పడంతో ఇంటికీ వెళ్లిపోయాడు. కక్ష సాధించే ప్రయత్నంలో వాలంటీర్ లక్ష్మణరావు ఊరి శివారులోని మర్రిచెట్టు దగ్గర ఉండగా... కొందరు వ్యక్తులు అతనిపై హత్యాయత్నం చేశారు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ వాలంటీర్ లక్ష్మణరావు మృతి చెందాడు.
ఇంట్లో ఉండమన్నందుకు దాడి... వాలంటీర్ మృతి - లాక్డౌన్ ఎఫెక్ట్
లాక్డౌన్ నిబంధనలు పాటించమన్నందుకు వాలంటీర్ పై దాడి చేసి ఘటన విజయనగరం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడి ఘటనలో వాలంటీర్ మృతి చెందాడు.
విజయనగరం జిల్లాలో వాలంటీర్ మృతి