విజయనగరం జిల్లా మక్కువ మండల తహసీల్దార్ దొడ్డి వీరభద్రరావు పై ములక్కాయ వలసగ్రామానికి చెందిన కొందరు దాడికి చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మక్కువ మండలం ములక్కాయ వలస గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ చేసేందుకు 18 ఎకరాల భూమిని అధికారులు ఎంపిక చేశారు. అయితే ఆ భూమిని చాలా కాలంగా సాగు చేస్తున్నామని గ్రామానికి సాలాపు కొటేశ్వరరావు కుటుంబీకులు తెలిపారు. ఈనెల 1 న ఆ భూమిలో కోటేశ్వరరావు కుటుంబీకులు వ్యవసాయ పనులు చేస్తున్నట్లు తహసీల్దార్ వీరభద్రరావుకు సమాచారం వచ్చింది.
ములక్కాయవలసలో తహసీల్దార్ పై దాడి - vizainagaram crime news
విజయనగరం జిల్లా మక్కువ మండల తహసీల్దార్ దొడ్డి వీరభద్రరావు పై ములక్కాయ వలస గ్రామానికి చెందిన కొందరు దాడికి చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పనులు నిలిపివేయాలని వారిని ఆదేశించారు. అయితే ఈ భూమి పైకి రావద్దని వెళ్లిపోవాలని వారు హెచ్చరించారు. తహసీల్దార్ పొలంలో వేసిన కంచె తీసేందుకు ప్రయత్నించగా ఆయనపై దాడి చేశారు. ఈనెల 2న తహసీల్దార్.. మక్కువ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే కోటేశ్వరరావు కుటుంబీకులు 18 ఏళ్ల నుంచి ఆ భూమిని లీజుకు తీసుకోని సాగు చేస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా వీరు సాగు చేస్తున్న భూమిని డీ పట్టా భూమిగా గుర్తించారు. శుక్రవారం సీఆర్పీఎఫ్ పోలీసులు సమక్షంలో ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. తమకు న్యాయం చేయాలని రైతు కుటుంబం పార్వతీపురం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లారు.
ఇదీ చదవండి: