ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వాళ్లను విధుల్లోకి తీసుకోండి' - విజయనగరంలో క్రషీ, లింక్ వర్కర్ల ధర్నా వార్తలు

క్రషీ, లింక్ వర్కర్లనే అంగన్వాడీ కార్యకర్తలుగా, సహాయకులుగా నియమించాలని విజయనగరంలో సామాజిక హక్కుల పోరాట వేదిక నేతలు ధర్నా చేశారు.

social rights leaders protest at vizianagarram district
విజయనగరంలో సామాజిక హక్కుల పోరాట వేదిక నేతల ధర్నా

By

Published : Oct 17, 2020, 3:25 PM IST

విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట సామాజిక హక్కుల పోరాట వేదిక నాయకులు నిరసన చేపట్టారు. క్రషీ, లింక్ వర్కర్లనే అంగన్వాడీ కార్యకర్తలుగా, సహాయకులుగా నియమించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల ఖాళీ పోస్టులను క్రషీ,లింక్ వర్కర్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి ప్రకటించినందున గతంలో పనిచేసిన క్రషీ, లింక్ వర్కర్లు అందరిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సామాజిక హక్కుల పోరాట వేదిక జిల్లా అధ్యక్షులు పాలక రంజిత్ కుమార్, కార్యదర్శి తాడంగి సాయిబాబు, ఉపాధ్యక్షులు ఊయక గంగరాజు, క్రషీ, లింక్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details