భోగాపురంలో కప్పుకున్న మంచు దుప్పటి - భోగాపురంలో కప్పుకున్న మంచు దుప్పటి
నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురంలో మంచు దుప్పటి కప్పుకొని రోడ్లన్నీ శ్వేతవర్ణాన్ని అద్దుకున్నాయి. దట్టమైన పొగమంచు కురవటంతో జాతీయ రహదారిపై ఎక్కడిక్కడ వాహనాలు లైట్లు వేసుకుని వెళ్లడం కనిపించింది.
![భోగాపురంలో కప్పుకున్న మంచు దుప్పటి Snow covered in Bhogapuram vizianagaram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10224858-573-10224858-1610522515065.jpg)
భోగాపురంలో కప్పుకున్న మంచు దుప్పటి
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. తెల్లవారు జామున నుంచి ఉదయం 8 గంటల వరకూ మంచు విపరీతంగా కురిసింది. దట్టమైన పొగమంచు కురవటంతో జాతీయ రహదారిపై ఎక్కడిక్కడ రాకపోకలు స్తంభించాయి. ప్రధాన కూడళ్లలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి వాహనాల రాకపోకలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు.
భోగాపురంలో కప్పుకున్న మంచు దుప్పటి