ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సచివాలయ నిర్మాణ స్థలంలో వివాదం... పోటీగా వెలసిన పునాదిరాళ్లు - vizayanagram latest news

సచివాలయ నిర్మాణ స్థలం విషయంలో...అధికారులకు, కాలనీ వాసులకు మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకున్న సంఘటన విజయనగరం జిల్లా లక్కీడాంలో చోటుచేసుకుంది.

Slight tension with regard to Secretariat construction site in vizayanagram
సచివాలయ స్థల విషయంలో స్వల్ప ఉద్రిక్తత

By

Published : Jul 1, 2020, 6:11 PM IST


విజయనగరం జిల్లా గంట్యాడ మండలం లక్కీడాంలో సచివాలయ నిర్మాణ స్థలం విషయంలో వివాదం నెలకొంది. లక్కీడాంలోని ఎస్సీ కాలనీలో గ్రామ సచివాలయం నిర్మాణం కోసం అధికారులు స్థలం సేకరించారు. ఎస్సీ వర్గీయుల భవిష్యత్ అవసరాల కోసం కూడా 4సెంట్ల భూమిని కేటాయించారు. అయితే మంగళవారం రాత్రి సచివాలయానికి కేటాయించిన స్థలంలో ఎస్సీ వర్గీయులు అంబేడ్కర్ భవన నిర్మాణానికి పునాది వేయడంతో వివాదం మెుదలైంది. అక్కడికి చేరుకున్న పోలీసులకు, కాలనీ వాసులకు మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది.

సచివాలయ స్థల విషయంలో స్వల్ప ఉద్రిక్తత

స్థల పరిశీలన సమయంలో సచివాలయ నిర్మాణానికి ఎస్సీ కాలనీ వాసులు అంగీకరించారని అధికారులు చెబుతున్నారు. అంబేడ్కర్ భవనానికి 4సెంట్ల భూమి కేటాయించినా వివాదం సృష్టించడం సరికాదని అధికారులు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. అయితే సచివాలయ నిర్మాణానికి ఎస్సీ వర్గీయులు ససేమిరా అనడంతో అధికారులు వెనుదిరిగారు.

ఇవీ చదవండి:దొంగను పట్టించింది కారం... స్థానికులు చేశారు ఒళ్లు హూనం...

ABOUT THE AUTHOR

...view details