ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులు.. గ్రామస్థుల ఆగ్రహం

By

Published : Jan 21, 2023, 8:40 PM IST

Updated : Jan 22, 2023, 11:34 AM IST

Sexually Harassment: ఉపాధ్యాయులకు సమాజంలో ఎనలేని గౌరవం ఉంది. కానీ ప్రధానోపాధ్యాయుడు చేసిన పనికి ఆందోళన చేస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారిపై ప్రధానోపాధ్యాయుడు లైగింకంగా వేదించిన దుర్ఘటన విజయనగరం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులు
Sixth class student sexually harassed by headmaster

Sexually Harassment: ఆయన వృతి తమ దగ్గర చదువుకొనే విద్యార్థులను ప్రయోజకుల్ని చేయడం. కానీ అతను ఆ పనిని మరచి 12 సంవత్సరాల విద్యార్థినిపై లైగింక వేదింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయనగరం జిల్లాలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పై ప్రధాన ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాలుగు నెలలుగా తమ కుమార్తెను లైంగిక వేధిస్తున్నట్లు తల్లి ఆదిలక్ష్మి తెలిపారు.

సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాల ప్రారంభం కావడంతో పాఠశాలకు ఎందుకు వెళ్ళట్లేదని తల్లి కుమార్తెను అడగగా ఆ పాఠశాలకు వెళ్ళనని వేరే హాస్టల్లో ఎక్కడైనా వెళతానని ఏడుస్తూ చెప్పిందని, విషయం ఏం జరిగిందని తల్లి అడగగా ప్రధానోపాధ్యాయుడు నన్ను రోజు బాత్రూంలోకి రమ్మని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్థిని చెప్పినట్లు తల్లి గ్రామస్థులకు ఉపాధ్యాయులకు తెలిపింది. అనంతరం ఇదే విషయం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పాఠశాల వద్ద కు చేరుకొని పాఠశాల విద్యార్థులను, గ్రామస్థులను విచారణ చేపట్టి వివరాలు సేకరించారు.

ప్రధానోపాధ్యాయుడు తీరుపై విద్యార్థులు గ్రామస్థులు యువత పాఠశాల వద్ద ప్రధానోపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడు అప్పలరాజు పోలీసులు ఫోన్​కు అందుబాటులో లేనట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై జనార్దన్ రావు తెలిపారు.

ఇవీ చదవండి

Last Updated : Jan 22, 2023, 11:34 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details