ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేత్ర పర్వంగా శివ పార్వతుల ఊరేగింపు - ఘనంగా శివ పార్వతుల విగ్రహాలను ఊరేగించిన పారమ్మ కొండ గిరిజనులు

శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు గిరిజనులు ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. కార్తీకమాసం చివరి సోమవారం విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పారమ్మ కొండపై.. దేవతామూర్తులకు కళ్యాణం నిర్వహించనున్నారు. ఆనవాయితీ ప్రకారం గిరిజనులు ఆ విగ్రహాలను.. దిమ్స ఆటపాటలతో సందడి చేస్తూ ఊరేగింపుగా తీసుకువెళ్లారు.

siva parvati idol procession
శివ పార్వతులను ఊరేగిస్తున్న గిరిజనులు

By

Published : Dec 6, 2020, 5:28 PM IST

శివ పార్వతులను ఊరేగిస్తున్న గిరిజనులు

విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పారమ్మ కొండ పరిసర గిరిజనులు.. శివ పార్వతుల విగ్రహాలను ఘనంగా విహరింపజేశఆరు. కోస్ట్ వలస నుంచి చిన్న చీపురు వలస, పెద చీపురువలస, పనుకువలస మీదుగా విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. వారి ఆచార దిమ్స ఆటపాటలతో సందడి చేశారు.

ఏటా కార్తీకమాసం చివరి సోమవారంలో కొండపైన శివపార్వతుల విగ్రహాలకు.. వివాహ మహోత్సవాన్ని దేవాదాయ శాఖ అధికారులు ఘనంగా నిర్వహిస్తారు. అప్పటికి వారం ముందు పరిసర గ్రామాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించి పండుగ చేయడం ఆనవాయితీగా వస్తోంది. చివరి సోమవారం నాటికి కళ్యాణ మహోత్సవానికి పారమ్మ కొండ వద్దకు విగ్రహాలను చేర్చుతారు. సోమవారం పారమ్మ కొండలో శివపార్వతుల కళ్యాణం జరుగనుండగా.. సాలూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details