విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే జోగారావు, ఉప కలెక్టర్ విదేహ్ ఖారే, ఐటీడీఏ పీవో కూర్మనాథ్ స్థల పరిశీలన చేశారు. ప్రాంతీయ ఆసుపత్రి ఎదురుగా ఉన్న పశువైద్య కేంద్రం, ఆర్ అండ్ బీ జలవనరుల శాఖ కార్యాలయాల్లో అదనంగా ఉన్న స్థల సేకరణకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు. గిరిజన ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఇందుకోసం రూ .25 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. స్థలం త్వరగా సేకరించి నివేదికలు అందజేయాలని అధికారులకు సూచించారు.
పార్వతీపురంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం స్థల పరిశీలన - పార్వతీపురంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ చూపుతుందని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం... విజయనగరం జిల్లా పార్వతీపురంలో స్థలాన్ని పరిశీలించారు.
పార్వతీపురంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం స్థల పరిశీలన