ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థం దేవస్థానంలో స్వామివారి రథయాత్ర శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. స్వామిని తిరు వీధుల్లో ఊరేగించి...ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామనామం జపంతో పురవీధులన్నీ మార్మోగాయి. ముందుగా స్వామి వారి కల్యాణ మండపం వద్ద పండిత పరిషత్ నిర్వహించి... ఈ పూజలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రసాదరావు, కమిటీ సిబ్బంది, విజయనగరం రూరల్ సీఐ సత్యమంగ వేణి పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి.... స్వామివారి రథయాత్ర కనులారా వీక్షించారు.
రథయాత్రతో పులకించిన రామతీర్థం - Sitaramula Rathyatra at Ramatirtham
రామతీర్థం దేవస్థానంలో సీతారాముల రథయాత్ర శుక్రవారం వైభవంగా జరిగింది. పురవీధులన్నీ రామనామస్మరణతో మార్మోగాయి. పరిసర గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు, యువకులు హాజరయ్యారు.
రథయాత్రతో పులకించిన రామతీర్థం