విజయనగరం రాజులు.. పూసపాటి వంశీయుల ఇలవేల్పు... ఉత్తరాంధ్ర ప్రజల కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారు. పైడిమాంబకు సిరిమాను(Sirimanu Uthsavam) సంబరం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నెల రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో తొలేళ్లు, సిరిమానోత్సవం(Sirimanu Uthsavam) ప్రధాన ఘట్టాలు. ఈ సిరిమాను సంబరం ప్రతి ఏటా అంగరంగ వైభవంగా సాగుతుంది. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా.. ఒడిశా నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు తరలొస్తారు. అయితే కరోనా నేపథ్యంలో పండగను కిందటి సంవత్సరం హంగు ఆర్భాటం లేకుండానే కానిచ్చేసారు. కొవిడ్ కాస్త తగ్గుముఖం పట్టినా ఈ ఏడాది కూడా సిరిమానోత్సవాన్ని (Pydithalli Sirimanu Uthsavam) సాదాసీదాగే నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.
కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా పైడితల్లమ్మ వారి ఉత్సవాలకు భక్తుల రాకపోకలను నియంత్రించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ప్రజా రవాణాను నిలిపివేయటంతో పాటు వ్యాపార సముదాయాలను కూడా మూసివేశారు. సిరిమానుతో పాటు వెంట తిరిగే వివిధ రథాల వెనుక వాలంటీర్లను మాత్రమే అనుమతించనున్నారు. వీటితోపాటు ఆలయంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సిరిమాను సంబరానికి పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు(Sirimanu Uthsavam at Pydithalli Ammavaru Temple) చేసింది. సుమారు 2 వేల 500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఫాల్కన్ మొబైల్ రాండ్ కంట్రోల్ వాహనంనూ వినియోగిస్తున్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు విజయనగరంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు.