ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బలరాంపురంలో పైడితల్లి అమ్మవారి సిరిమాను గుర్తింపు - paidithalli ammavari sirimanu latest news

విజయనగరంలో ఘనంగా నిర్వహించే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం కోసం.. సిరిమాను చెట్టును గుర్తించారు. ఈ పవిత్ర వృక్షానికి భక్తులు పూజలు నిర్వహించారు.

sirimanu tree identified for paidithalli sirimanotsav
పైడితల్లి అమ్మవారి సిరిమాను గుర్తింపు

By

Published : Oct 7, 2020, 2:41 PM IST

పైడితల్లి అమ్మవారి సిరిమాను గుర్తింపు

విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతరలో భాగంగా ప్రధాన ఘట్టమైన సిరిమాను చెట్టును గుర్తించి, చెట్టువద్ద ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సిరిమాను అధిరోహించే పూజారికి అమ్మవారు స్వప్నంలో రావటంతో ప్రతి ఏటా పైడితల్లి అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగానే విజయనగరం జిల్లా జామి మండలం బలరాంపురంలో సిరిమాను చెట్టుని గుర్తించి, పూజారులు చెట్టుకు బొట్టు పెట్టి విశేష పూజలు జరిపారు. అనంతరం జిల్లా కేంద్రానికి తరిలించేందుకు ఈ నెల 12వ తేదీన ముహూర్తం ఖరారు చేసినట్లు ఆలయ పూజారి వివరించారు.

అమ్మవారు స్వప్నంలో కనిపించి... బలరాంపురంలో పెంటం చిన్నంనాయుడు, తమ్మినాయుడు, అప్పలనాయుడు కల్లాల్లో ఉన్న సిరిమాను చెట్టు కావాలని కోరారు. ఈ నెల 12న 9 గంటల 15 నిమిషాలకు చెట్టును నరికి.. జిల్లా కేంద్రానికి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. - బంటుపల్లి వెంకటరావు, ఆలయ పూజారి

ఇదీ చదవండి:

చారిత్రక మహారాజ కళాశాల ప్రైవేటీకరణకు సంచైత నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details