ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లంచగొండి ఎస్సై.. రెడ్ హాండెడ్​గా అరెస్ట్ - విజయనగరం జిల్లా

స్టేషన్​ బెయిల్​ ఇచ్చేందుకు రూ. 30 వేలు లంచం తీసుకోబోయిన ఎస్సైని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో విజయనగరం అధికారులు రంగంలోకి దిగి అవినీతి పోలీసును అదుపులోకి తీసుకున్నారు.

SI CAUGHT BY ACB OFFICIALS
లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎస్సై

By

Published : Aug 4, 2021, 7:46 PM IST

విజయనగరం జిల్లా కొత్తవలస పోలీస్​స్టేషన్​లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్. నరసింహమూర్తి అనే ఎస్సై.. ఏసీబీ వలకు చిక్కాడు. కొత్తవలస మండలంలోని పాత సుంకరపాలేనికి చెందిన బి.వి. రాము అనే వ్యక్తికి.. స్టేషన్ బెయిలు మంజూరు చేసేందుకు ఆ ఎస్సై రూ. 30,000 లంచం డిమాండ్​ చేశాడు.

మెుదటి విడతగా రూ. 15 వేలు తీసులుకున్న పోలీసు.. రెండో విడతగా మిగిలిన రూ. 15 వేల లంచం సొమ్మును తన నివాసంలో బాధితుడి నుంచి తీసుకుంటుండగా విజయనగరం ఏసీబీ అధికారులు దాడి చేశారు. లంచం తీసుకుంటుండగా అవినీతి అధికారిని పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details