దిశా యాప్ డౌన్ల్లోడ్ చేసుకుని చూపించిన వారికి విజయనగరం పట్టణంలో ఉచితంగా బస్సు ప్రయాణం చేసే సౌకర్యాన్ని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ప్రారంభించారు. విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో దిశా యాప్ వినియోగంపై అవగాహన సదస్సుని నిర్వహించారు. శ్రీ దేవీ దండుమారమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పాల్గొన్నారు.
మీ ఫోన్లో దిశా యాప్ ఉందా..? అయితే ఈ వార్త మీకోసమే..! - విజయనగరం జిల్లా వార్తలు
మీ మొబైల్లో దిశా యాప్ ఉందా.. అయితే మీకో శుభవార్త.. విజయనగరంలో మహిళలకు ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి చక్కని అవకాశం కల్పించారు. బస్సు ఎక్కి ఫోన్లోని దిశా యాప్‌ని చూపిస్తే చాలు నగరంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. రాష్ట్రంలోనే దిశా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడంలో విజయనగరం మొదటి స్థానంలో ఉండాలని, ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అందులో భాగంగానే ఈ అవకాశం కల్పించారు.
దిశా యాప్
ఈ యాప్ ఆడ బిడ్డలను రక్షించుకునే ఆయుధమని శ్రీవాణి అన్నారు. రాష్ట్రంలోనే దిశా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడంలో విజయనగరం మొదటి స్థానంలో ఉండాలని, ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.