ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

sfi protest: ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రైవేటీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలి: ఎస్ఎఫ్ఐ - విజయనగరం జిల్లా వార్తలు

విజయనగరంలో ఎస్​ఎఫ్ఐ నాయకులు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

sfi protest
విజయనగరంలో ఎస్​ఎఫ్ఐ నాయకుల ధర్నా

By

Published : Jul 12, 2021, 9:34 PM IST

రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రైవేటీకరణ యత్నాలను విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్ధి సంఘం (sfi) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు హర్ష ఆధ్వర్యంలో.. విజయనగరం కలెక్టరేట్ వద్ద విద్యార్ధులు ధర్నా చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను రక్షించుకుందాం... ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకుందాం అంటూ నినాదాలు చేశారు.

ఎయిడెడ్ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు వాపోయారు. తద్వారా.. పేద విద్యార్ధులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఇందుకు విజయనగరం మహారాజా కళాశాలే నిదర్శనంగా పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్దుల దృష్ట్యా ఆ విద్యాసంస్థల ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details