విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ శిక్షణకు ఎంపికలు జరిగాయి. ఇందులో భాగంగా వందలాది మంది విద్యార్థులు వివిధ అంశాల్లో పోటీ పడి అర్హత సాధించారు. క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం సాధించేందుకు ఈ శిక్షణ దోహదపడుతుంది. ఎన్సీసీ శిక్షణ పూర్తయ్యక అందించే ధ్రువ పత్రానికి ఉద్యోగ ప్రవేశాల్లో రిజర్వేషన్ ఉండటంతో ఈ కోర్సు అభ్యసనకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగయ్య తెలిపారు.
జాతీయ క్యాడెట్ కోర్సు శిక్షణకు ఎంపికలు - national cadet crops
ఎన్.సి.సి కోర్సు శిక్షణకు విజయనగరం జిల్లాలో ఎంపికలు నిర్వహించారు. 14వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరిగగా... విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి పలువురిని శిక్షణకు చేశారు.
జాతీయ క్యాడెట్ కోర్సు శిక్షణకు ఎంపికలు