విజయనగరం జిల్లా సాలూరు దగ్గర.. జాతీయ రహదారిపై పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. ఓ వ్యక్తి వాహనంతో వేగంగా వస్తుండగా.. అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అతను వాహనం ఆపకుండా.. ఎస్ఐ ఫక్రుద్దీన్‌ను ఢీకొట్టి మరీ వేగంగా ముందుకు వెళ్లాడు. ఈ క్రమంలో గొల్లవీధి కూడలి వద్ద వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యాడు.
కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలై పడి ఉన్న అతనికి... అదే ఎస్సై ఫక్రుద్దీన్.. మానవత్వంతో సపర్యలు చేశారు. నీళ్లు తాగించారు. అతను గంజాయి సరఫరా చేస్తూ.. పరారయ్యేందుకు యత్నించినట్టు గుర్తించారు. 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని ఒడిశాకు చెందిన దేవేందర్ ఖిల్లో (25)గా గుర్తించారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.