ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Digging for idols: అమ్మవారు కలలో కనిపించిందని విగ్రహాల కోసం వేట - vizianagaram district latest news

దేవుళ్లంటే భక్తి ఉండటం సహజం. కానీ ఆ భక్తి పరాకాష్ఠకు చేరితే... కొందరు ఎంతకైనా తెగించేందుకు వెనుకాడరు. వారు అనుకున్నది సాధించేవరకూ విశ్రమించరు. సరిగ్గా ఇలాంటి ఘటనే విజయనగరం జిల్లా పుర్రేవలస లో జరిగింది. అమ్మవారు కలలో కనిపించి.. కోవెల కట్టించాలని కోరిందని ఓ భక్తురాలు విగ్రహాల(idols) కోసం వేట ప్రారంభించింది. అమ్మవారి విగ్రహాలు కనిపిస్తే ఆస్తులు అమ్మైనా గుడి కట్టిస్తానని చెబుతోంది.

searching for goddess statues in purrevalasa vizianagaram
అమ్మవారు కలలో కనిపించిందని విగ్రహాల కోసం వేట

By

Published : Jun 13, 2021, 10:08 PM IST

Updated : Jun 14, 2021, 11:59 AM IST

అమ్మవారు కలలో కనిపించిందని విగ్రహాల కోసం వేట

విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పుర్రేవలస గ్రామంలో కంది లక్ష్మి అనే మహిళ నివసిస్తోంది. ఈ క్రమంలో ఆమె కలలో శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి(రాజులమ్మ) అమ్మవారు వచ్చి.. విగ్రహాలు పంట పొలంలో ఉన్నాయని, వాటిని వెలికితీసి గుడి కట్టించమని కోరిందని లక్ష్మి తెలిపింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురై.. తన కుమారుడు రామకృష్ణ సహాయంతో విగ్రహాల కోసం తవ్వకాలు ప్రారంభించింది.

కూలీల సహాయంతో ఇప్పటివరకు 30అడుగుల లోతు వరకు తవ్వారు. ఇందుకు సుమారు రూ.1.5లక్షలు ఖర్చు చేసినట్లు రామకృష్ణ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో విగ్రహాలు దొరుకుతాయని, విగ్రహాలు లభ్యం కాగానే తన ఆస్తులు అమ్మైనా సరే.. అమ్మవారికి గుడి కట్టిస్తానని కంది లక్ష్మి చెబుతోంది. ఈ ఘటనను చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీచదవండి.

suhasini case: సుహాసిని కేసులో మరో ట్విస్ట్​.. తెరపైకి రెండో భర్త

Last Updated : Jun 14, 2021, 11:59 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details