విజయనగరం జిల్లాలో 286 ప్రభుత్వ, 168 ప్రేవేటు ఉన్నత పాఠశాలలు నడుస్తున్నాయి. జిల్లాలో గురుకుల విద్యాలయాలు మినహా... ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థలన్నీ తెరుచుకున్నాయి. కరోనా కారణంగా... మొదటి రోజు విద్యార్ధులు అంతంత మాత్రమే హాజరయ్యారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి కారణంగా పాఠశాలల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని జాగ్రత్తలు చేపట్టారు.
తెరుచుకున్న పాఠశాలలు.. జాగ్రత్తల మధ్య తరగతులు - విజయనగరంలో పాఠశాలలు
ఎట్టకేలకు పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయి. కరోనా కారణంగా 4 నెలలు ఆలస్యంగా విద్యార్ధులు బడిలో అడుగు పెట్టారు. నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కావటంతో విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. కోవిడ్ నియంత్రణకు చర్యలు చేపట్టింది.

ఎట్టకేలకు తెరుచుకున్న పాఠశాలలు!
విద్యార్దులకు శానిటైజర్ అందుబాటులో ఉంచటంతో పాటు... సాధ్యమైనంతవరకు థర్మల్ స్కానింగ్ నిర్వహించారు. తరగతి గదుల్లో విద్యార్ధుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారులు, జిల్లా విద్యాశాఖ సూచనలు, సలహాల మేరకు విద్యార్థుల ఆరోగ్య భద్రత, కరోనా నియంత్రణ విషయంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలియచేశారు.
ఇదీ చదవండి: