విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని కొల్లి భోగాపురం హై స్కూల్ తో పాటు.. పలు ఇతర ప్రభుత్వ పాఠశాలల్లోనూ నీటి గంట అమలు.. క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. తాగు నీటి సౌకర్యం సరిగ్గా లేని కారణంగా... విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇంటి నుంచి నీరు తెచ్చుకోవాడానికి బాటిళ్లు లేవని విద్యార్థులు చెప్పారు. దాతలు ఎవరైనా ముందుకొచ్చి పిల్లలకు వాటర్ బాటిల్స్ ఇప్పించాలని అధ్యాపకులు కోరుతున్నారు.
సమయానికి గంట మోగుతున్నా.. తాగడానికి నీళ్లు లేవు! - scarcity of water govt policy of water bell not implementing properly
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం ప్రభుత్వ పాఠశాలలో నీటిగంట అమలు తీరు... ఆశించిన రీతిలో జరగటం లేదు. నీటి కొరత కారణంగా విద్యర్థులకు తగినంత నీరు సరఫరా చేయలేకపోతున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
![సమయానికి గంట మోగుతున్నా.. తాగడానికి నీళ్లు లేవు! scarcity of water govt policy of water bell not implementing properly](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5295573-1066-5295573-1575690876696.jpg)
సరిగ్గా అమలుకాని నీటి గంట