ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంబరాలు జరగాల్సిన ఇంట్లో.. అంతులేని విషాదం!

విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో విషాదం నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా వెడుల్లా సింహాచలమ్మ అనే మహిళ పోటీ చేసింది. పోలింగ్ రోజు ఓటేసిన ఆమె భర్త.. కాసేపటికే అస్వస్థతతో మృతి చెందాడు. మరో వైపు.. అదే రోజున సాయంత్రం వెలువడిన ఫలితాల్లో సింహాచలమ్మ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.

ఓ వైపు పతి వియోగం...మరో వైపు పదవి యోగం !
ఓ వైపు పతి వియోగం...మరో వైపు పదవి యోగం !

By

Published : Feb 15, 2021, 7:05 PM IST

సంబరాలు జరగాల్సిన ఇంట తీరని విషాదం నెలకొంది. ఆనందంగా గడపాల్సిన క్షణాలు ఆవిరయ్యాయి. విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా వెడుల్లా సింహాచలమ్మ పోటీ చేశారు. శనివారం పోలింగ్ జరగింది. సింహాచలమ్మ భర్త భీమన్న దొర... మధ్యాహ్నం ఓటేసి ఇంటికి చేరుకున్నారు. కాసేపటికే ఆయన ఉన్నట్టుండి కుప్పకూలిపోయి మృతి చెందారు.

ఆ కొద్దిసేపటికే పంచాయతీ ఫలితాలు వెలువడగా.. సింహాచలమ్మ విజయం సాధింటినట్లు అధికారులు ప్రకటించారు. పదవి దక్కినా.. పతీ వియోగంతో సింహాచలమ్మ ఆనందం ఆవిరైంది. ఓ వైపు దుఃఖాన్ని దిగమింగుకొని.. మరోవైపు ఎన్నికల పత్రంపై సంతకం చేయాల్సి వచ్చింది. ఇది చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details