విజయనగరం జిల్లా పార్వతీపురంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలు పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అన్నవరం రీచ్ నుంచి ఇసుకను ఈ లారీలు తరలిస్తుండగా పట్టుబడ్డాయి.
ప్రభుత్వ స్టికర్ వేసేయ్... అక్రమ రవాణా చేసేయ్ - sand Smuggling news in telugu
ప్రభుత్వ నిర్మాణాల కోసం ఇసుక లారీలకు వేసే స్టిక్కర్లను వాళ్ల లారీలకు వేసుకున్నారు. ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా... ఇసుక రవాణాకు వాడుకున్నారు. తమను ఎవరూ అడ్డగించరనే ఆలోచనతో లారీలపై ఇసుకను తరలించారు. పోలీసులకు చిక్కారు.
sand Smuggling trucks are seized at Parvatipuram in Vijayanagaram district
లారీ చోదకులు వాహన అద్దాలపై ఆన్ డ్యూటీ ఏపీఎండీసీ అన్న స్టిక్కర్లు అంటించారు. ప్రభుత్వ నిర్మాణాల కోసం ఇసుక రవాణా చేసే సమయంలో మాత్రమే ఈ స్టిక్కర్లు అంటిస్టుండగా... అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నప్పుడు ఈ స్టిక్కర్లను లారీలపై ఉంచారు. ఎటువటి అనుమతి పత్రాలు లేకుండా పార్వతీపురం శివారులోని ఓ ప్రైవేట్ నిర్మాణం వద్ద ఇసుకను అన్లోడ్ చేస్తుండగా పోలీసులకు పట్టుకొని.. నిందులపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:వరంగల్లో అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు