ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేగంగా కరోనా అనుమానితుల నమూనాల సేకరణ - samples collections for testing corona suspects in vizanagaram dst

విజయనగరం జిల్లాలో కరోనా అనుమానితుల నుంచి నమూనాల సేకరణను అధికారులు మరింత వేగవంతం చేశారు. పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిలో నమూనాల సేకరణ విభాగాన్ని ప్రారంభించారు. డివిజన్ పరిధిలోని 139 మంది నమూనాలు సేకరించి నిర్ధరణ పరీక్షల కోసం జిల్లా కేంద్రానికి పంపించారు.

samples collections for testing corona suspects in vizanagaram dst
విజయనగరం జిల్లాలో వేగంగా నమూనాల సేకరణ

By

Published : Apr 15, 2020, 10:12 AM IST

రాష్ట్రంలో ఇప్పటివరకూ... ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరమే. అయినప్పటికీ అక్కడ అధికారులు నిర్లక్ష్యంగా లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయనగరం జిల్లా సాలూరు, బొబ్బిలి మండలాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో వార్డు వాలంటీర్లు ఇటీవల ఇంటింటి సర్వే నిర్వహించారు. దూర ప్రాంతాల్లో ఇటీవలే స్వగ్రామాలకు చేరిన వారిని గుర్తించి ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సమాచారం ఇచ్చారు.

వైద్య సిబ్బందిలో అనుమానితులను అంబులెన్సుల ద్వారా క్రాంతి ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక విభాగంలో అనుమానితుల గొంతు నుంచి ద్రావణాన్ని సేకరించి నిర్ధారణ పరీక్షల నిమిత్తం పంపించారు. తెలంగాణ నుంచి దొంగచాటుగా స్వగ్రామాలకు చేరేందుకు ప్రయత్నించిన 42 మందిని పోలీసులు పట్టుకొని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వారి నుంచి నమూనాలు సేకరించి క్వారంటైన్​కి తరలించారు. బొబ్బిలి ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని తీసుకువచ్చి నమూనాల సేకరణకు నియమించారు.

ABOUT THE AUTHOR

...view details