విజయనగరం జిల్లా సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ లో పని చేస్తున్న సిబ్బంది శానిటేషన్ మిషన్ రూపొందించారు. ఈ మిషన్ తో కాంప్లెక్స్ ఆవరణలో శానిటేషన్ చేశారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు... ప్రయాణికులు కూర్చునే కుర్చీలు, గ్యారేజీలో బస్సులు రిపేర్ చేసే పనిముట్లు, గ్యారేజీ ఆవరణలో ఉన్న పరిసర ప్రాంతాలకు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం చేస్తున్నామని డిపో మేనేజర్ గౌతమ్ ఛటర్జీ తెలిపారు.
శానిటేషన్ యంత్రాన్ని రూపొందించిన సాలూరు ఆర్టీసీ సిబ్బంది - సాలూరు వార్తలు
విజయనగరం జిల్లా సాలూరు ఆర్టీసీ సిబ్బంది... బస్సు బ్యాటరీ, ఇతర పరికరాలతో శానిటేషన్ యంత్రాన్ని తయారుచేశారు. ఈ యంత్రంతో డిపో ప్రాంగణాన్ని శానిటేషన్ చేశారు. మిషన్ తయారు చేయడానికి రూ.25 వేలు ఖర్చు అయ్యిందని డిపో మేనేజర్ తెలిపారు.
శానిటేషన్ యంత్రాన్ని రూపొందించిన సాలూరు ఆర్టీసీ సిబ్బంది
ఆర్టీసీ సిబ్బంది రూపొందించిన శానిటేషన్ యంత్రాన్ని రూపొందించడానికి రూ. 25 వేలు ఖర్చు అయ్యిందని చెప్పారు. బస్సు బ్యాటరీ, ఒక డ్రమ్ము, స్ప్రే చేసే పైపులతో యంత్రం తయారు చేశామన్నారు.
ఇదీ చదవండి :కేబినెట్ భేటీ: కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ