విజయనగరం జిల్లాలో నేడు సాలూరు పట్టణ పురపాలక సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి పక్ష పార్టీ ఫ్లోర్ లీడర్కు సీటు కేటాయించకపోవడంపై.. తెదేపా నేతలు అధ్యక్షురాలి తీరును తప్పుబట్టారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయమై స్పదించిన మున్సిపల్ ఛైర్ పర్సన్ ఈశ్వరమ్మ.. తెదేపా కౌన్సిల్ సభ్యులు తమ పార్టీలో చేరాలని.. అప్పుడు వారికి సీట్లు ఇస్తామని చెప్పారు. ఛైర్ పర్సన్ స్పందనపై మరింత ఆగ్రహించిన తెదేపా సభ్యులు వాకౌట్ చేసి వెళ్లి పోయారు.