వివాదాస్పద కొఠియా గ్రామాలకు సంబంధించి, సుప్రీంకోర్టు విధించిన స్టేటస్‌కోను ఒడిశా ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆరోపించారు. స్టేటస్‌కో అమలయ్యేలా చూడాలని కోరుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరి జవహర్‌లాల్‌కు బుధవారం వినతిపత్రాన్ని సమర్పించారు.
'సుప్రీంకోర్టు స్టేటస్‌కోను ఒడిశా ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది' - విజయనగరం జిల్లా ముఖ్య వార్తలు
వివాదాస్పద కొఠియా గ్రామాలకు సంబంధించి, సుప్రీంకోర్టు విధించిన స్టేటస్ కోను ఒడిశా ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆరోపించారు. స్టేటస్‌కో అమలయ్యేలా చూడాలని కోరుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్‌కు బుధవారం వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ.. గంజాయిభద్ర, పట్టుచెన్నూరు, పగులు చెన్నూరు పంచాయితీ పరిధిలోని గ్రామాలను కొఠియా గ్రామాలుగా పిలుస్తారని, ఈ గ్రామాల విషయంలో ఒడిశా ప్రభుత్వం ఇటీవల కాలంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ దూకుడుగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఈ గ్రామాలు ఆంధ్రాలో విలీనం అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అంతవరకూ ఒడిశా ప్రభుత్వం స్టేటస్‌కోను గౌరవించేలా.. సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కూడా ఉన్నారు.
ఇదీ చదవండి: