ఇటీవల కురిసిన వర్షాలకు వేగావతి, సువర్ణముఖి, గోముఖ్ నదులు ఉప్పొంగాయి. సాలూరు నియోజకవర్గం పాచిపెంట, సాలూరు, పాలూరు తదితర గ్రామాల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
కాజ్వేలు ఉన్న చోట... వాటి మీదుగా నీరు ప్రవహిస్తుంది. ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. స్వర్ణముఖి నదులు ప్రవహిస్తున్న చోట అరటి, మొక్కజొన్న, వరి పంటలు నీట మునిగాయి.