ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Salur Municipality 2018లో తొలిస్థానం.. 2021లో 19వ స్థానం! స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆ మున్సిపాలిటీ దైన్య స్థితి!

Poor Sanitation in Salur Municipality: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకుని ఆదర్శంగా నిలిచిన పురపాలికలో నేడు పారిశుద్ధ్య నిర్వహణ గాడి తప్పింది. ఏ వార్డు చూసినా పేరుకుపోయిన చెత్తాచెదారం దర్శనమిస్తోంది. పారిశుద్ధ్య పనులపై పూర్తిగా అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఇదీ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలిక దుస్థితి.

Salur Municipality Sanitation
సాలూరు మున్సిపాలిటీ

By

Published : Jun 3, 2023, 9:24 AM IST

Poor Sanitation in Salur Municipality: సాలూరు మున్సిపాలిటీలో నాడు - నేడు చోటుచేసుకున్న అభివృద్ధి చూస్తుంటే అధికారుల పర్యవేక్షణ లోపానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. రోజులు గడిచే కొద్దీ పురగోమనంలోకి వెళ్లాల్సింది పోయి.. తిరోగమనంలోకి వెళుతుంది. సాలూరు మున్సిపాలిటీలో అభివృద్ధి మాట ఎలా ఉన్నా.. అవార్డులకు మాత్రం ఢోకా లేదు. 2018లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో సాలూరు నిలిచింది. 2015 లో మూడో ర్యాంక్, 2020లో 7వ ర్యాంక్, 2021లో 19వ ర్యాంకు సాధించింది.

2022 సంవత్సరంలో ఏకంగా జాతీయ స్థాయిలో ఓ విభాగంలో మొదటి ర్యాంక్ దక్కించుకుంది. 2011 నుంచి 2015 వరకు చూస్తే డంపింగ్ యార్డు నిర్వహణలో ఏకంగా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, క్లీన్ ఎర్త్ రికార్డ్ దక్కించుకుంది. ఇలా ఎన్నో పురస్కారాలు కైవసం చేసుకున్న పురపాలికలో.. ప్రస్తుతం డంపింగ్ యార్డు నిర్వహణను పూర్తిగా గాలికొదేలేశారు. వార్డుల్లో కనీసం చెత్తను తొలగించటం లేదని.. ఇటీవల మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేయడం.. ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.

No Power in Govt Hospital: వర్షానికి విద్యుత్ కట్.. జనరేటర్ ఉన్నా చీకట్లోనే రోగులు
సాలూరు పురపాలక సంఘంలో 29 వార్డులు ఉన్నాయి. సుమారుగా 70 వేల మంది జనాభా నివసిస్తున్నారు. పురపాలక సంఘంలో 122 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో రెగ్యులర్ ప్రాతిపదికన 35 మంది పనిచేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం.. కార్మికుల సంఖ్యలో పెంపు లేదని ప్రజలు చెబుతున్నారు.

ప్రజారోగ్యంపై అధికారులు దృష్టి సారించటం లేదని. వ్యాధుల బారిన పడితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు మండిపడుతున్నారు. ఇన్నాళ్లు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ లేని కారణంగానే సాలూరులో పారిశుద్ధ్య నిర్వహణలో అక్కడక్కడ లోపాలు చోటుచేసుకున్నాయని కమిషనర్‌ శంకరరావు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రెగ్యులర్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నియామకం జరిగిందని వెల్లడించారు.

KC Canal: ఘన చరిత్ర కలిగిన కేసీ కెనాల్​.. నేడు మురికి కూపంలా

"వార్డులో చెత్త పేరుకుపోయింది. కాలువలు కూడా క్లీనింగ్ చేయని పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో కాలువల క్లీన్​గా ఉండేవి. మేము ఏమైనా చెప్పినా వెంటనే క్లీన్ చేసేవారు. కానీ ప్రస్తుతం ఏమైనా చెప్తుంటే.. మాకు స్టాఫ్ లేరు అని చెప్తున్నారు. అదే విధంగా ట్రాక్టర్లు కూడా లేవు అని అంటున్నారు". - శైలజ, కౌన్సిలర్‌

"గతంలో మాకు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పోస్ట్ ఖాళీగా ఉండేది. ప్రస్తుతం కొత్త శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వచ్చారు. కాబట్టి మళ్లీ గాడిలో పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అన్ని మున్సిపాలిటీలతో పోటీ పడుతూ ఈ సారి కూడా మంచి ర్యాంకు రావడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా బెస్ట్ ర్యాంకు వస్తుంది అని అనుకుంటున్నాం". - శంకరరావు, కమిషనర్

Salur Municipality : నాడు దేశానికి ఆదర్శం.. నేడు పారిశుద్ధ్యం అధ్వానం

ABOUT THE AUTHOR

...view details