విజయనగరం జిల్లా సాలూరులో ఉన్న ఏపీ ఫైబర్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో లాక్డౌన్ అనంతరం కరోనా వ్యాప్తి చెందకుండా విడతల వారీగా ఉద్యోగులను అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ సగం మంది సిబ్బంది విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఎనిమిది గంటల పనిదినాన్ని ఏడున్నర గంటలకు తగ్గించారు.
సగం సిబ్బందితో తెరుచుకున్న సాలూరు ఫైబర్ ఫ్యాక్టరీ - విజయనగరం జిల్లాలో పరిశ్రమలు
లాక్డౌన్ సడలింపులో భాగంగా పరిశ్రమలు తెరవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా సాలూరులో ఉన్న ఫైబర్ ఫ్యాక్టరీ సగం మంది సిబ్బందితో ఉత్పత్తులు ప్రారంభించింది.
సగం సిబ్బందితో తెరుచుకున్న సాలూరు ఫైబర్ ఫ్యాక్టరీ