పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని విజయనగరం జిల్లాలో సాక్షర భారత్ సమన్వయ కర్తలు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం కోసం 2010 నుంచి తాము ప్రజలకు సేవలందిస్తున్నామన్నారు. రాత్రి బడులు నిర్వహించటంతో పాటు.. గ్రామంలో ప్రజలకు.. వీఆర్ఓ అందించే అన్ని సేవలను అందించామన్నారు. ఉన్నఫలంగా తమను ఉద్యోగాల నుంచి తొలగించటంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయని వాపోయారు.