విజయనగరం జిల్లా బొబ్బిలి లో రైతు సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శంబంగి వెంకట అప్పలనాయుడు హాజరయ్యారు .వైకాపా ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పని చేస్తుందని అన్నారు. రాష్ట్ర ఖజానా దివాలా స్థితిలో ఉన్నా రైతు ప్రయోజన కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. రైతు దినోత్సవంలో భాగంగా వ్యవసాయ, ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన స్టాల్సు ఎమ్మెల్యే తిలకించారు. తయారు చేస్తున్న నూతన యంత్రాలను పరిశీలించారు.నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
విజయనగరంలో ఘనంగా రైతు సదస్సు - బొబ్బిలి
విజయనగరం జిల్లాలో రైతుసదస్సును ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శంబంగి వెంకట అప్పలనాయుడు.. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు.
సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే
ఇదీ చూడండి చాగల్నాడు ఎత్తిపోతల ద్వారా సాగునీరు విడుదల