ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దసరా రద్దీ- ప్రయాణ ప్రాంగణాలు కిటకిట - బస్,రైల్వే స్టేషన్లు కిటకిట

దసరా పండగకు ప్రయాస పడైనా సొంత ఊర్లకు వెళ్లాలని ప్రజలు ఆర్టీసీ కాంప్లెక్స్​లను, రైల్వే స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రభావంతో అన్ని బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి.

బస్,రైల్వే స్టేషన్లు కిటకిట

By

Published : Oct 8, 2019, 2:33 PM IST

బస్,రైల్వే స్టేషన్లు కిటకిట
పండగను సొంత ఊరిలో చేసుకోవాలనే తపనతో ఆర్టీసీ కాంప్లెక్స్​లను, రైల్వే స్టేషన్లకు పోటెత్తుతున్నారు. దసరా సెలవులు కావటంతో ఆర్టీసీ బస్ స్టాండ్​లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పొట్టకూటి కోసం వలస వెళ్లిపోయిన వారు స్వగ్రామాల్లో నిర్వహించే దసరా ఉత్సవాల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తున్నందున విజయనగరం బస్టాండ్‌ ప్రయాణికులతో రద్దీగా మారింది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఏ బస్సు చూసినా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్​లో రద్దీ మరీ ఎక్కువగా ఉంది. ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దసరా పూర్తైనా వారం రోజుల వరకూ ప్రయాణికుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు పార్వతీపురం డిపోలో ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details