ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం దుకాణాల్లో నోస్టాక్‌ బోర్డులు... తాగేందుకు తప్పదు 'బార్‌'లు... - Run to the bar for the drug at parwathipuram

సంక్రాంతి పండుగ ముగిసినా బారుల వద్ద మందు బాబుల హడావిడి తగ్గలేదు. పండుగ దెబ్బకు చాలా దుకాణాల్లో సరకు మొత్తం ఖాళీ అయిపోయింది. ఫలితంగా చాలా చోట్ల నోస్టాక్‌ బోర్డులు దర్శనమిచ్చాయి. అందుకే బార్‌ల ఎదుట బారులు కనిపిస్తున్నాయి.

Run to the bar for the drug
మందు కోసం "బారు"లకు పరుగులు

By

Published : Jan 17, 2020, 4:11 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురంలో లిక్కర్‌ కోసం మందుబాబులు ఎగబడ్డారు. శుక్రవారం చాలా ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇచ్చాయి. బెలగాం శివారులోని ఓ బార్లో మద్యం దొరుకుతుందని గ్రహించిన మందుబాబులు బార్‌ ముందు క్యూ కట్టారు. మూడు కౌంటర్ల ద్వారా విక్రయాలు సాగించినా ఆ బార్‌లో రద్దీ తగ్గలేదు. ధరను ఇష్టారాజ్యంగా నిర్ణయించి విక్రయాలు సాగించారు.

బార్​ల వద్ద తాకిడి

ABOUT THE AUTHOR

...view details