ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు ఇవాళ, రేపు భారీ వర్ష సూచన ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. రాయలసీమ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది. వాగులు, వంకలు, నదుల్లో భారీగా వర్షపునీరు చేరే అవకాశం ఉందన్న ఆర్టీజీఎస్... పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన - rain forecast to rayalaseema
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. వాగులు, వంకలు, నదుల్లో భారీగా వర్షపునీరు చేరే అవకాశాలున్నాయన్న ఆర్టీజీఎస్... పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన