విజయనగరం జిల్లా సీతానగరం మండలం చిన్న భోగిలి కూడలి వద్ద ఆర్టీసీ సరకు రవాణా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు డిపోకు చెందిన ఆర్టీసీ కార్గో వాహనాన్ని తనిఖీ చేయగా లోపల 50 కిలోల బియ్యం బస్తాలు 210 ఉన్నాయని అధికారులు తెలిపారు. మొత్తం 10.5 ట న్నులు బియ్యం అక్రమంగా రవాణా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు.
ఆర్టీసీ వాహనంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా - ration rice caught in rtc bus at sitha nagaram
అక్రమార్కుల ఆగడాలకు హద్దే లేకుండా పోతుంది.. అధికారుల కళ్లు కప్పడానికి రోజుకో మార్గాన్ని ఎంచుకుంటున్నారు.. ఎవరికీ అనుమానం రాకుండా ఆర్టీసీ సరకు వాహనంలో పేదలకు చేరాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వైనం పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలంలో చోటుచేసుకుంది.
ఈ బియ్యం బగ్గన్న దొర వలస నుంచి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం తరలించేందుకు ఓ వ్యాపారి ఆర్టీసీ వాహనాన్ని అద్దెకు తీసుకున్నట్లు గుర్తించారు. బియ్యం అక్రమ రవాణా విషయాన్ని పోలీసులు కొంత ఆలస్యంగా రెవిన్యూ అధికారులకు తెలియజేశారు. బియ్యం రవాణా అవుతున్న వాహనం ఆర్టీసీకి సంబంధించింది కావడంతో పార్వతీపురం డిపో అధికారులు సంఘటనా ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరించారు. బియ్యం సంబంధించిన రిపోర్టును రెవెన్యూ అధికారులకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు
ఇదీ చదవండి: గవర్నర్ ఆదేశాలిచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవటం దారుణం:సుప్రీం