ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రిటైర్డ్​ ఉపాధ్యాయురాలి పర్సు దొంగిలించిన మహిళల అరెస్టు - latest robbery news in saluru

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఈనెల 10న బంగారు దుకాణం వద్ద చోరీ కేసులో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. తన మనవడి బారసాల కోసం బంగారు గొలుసు కొనుగోలు చేసేందుకు ఓ రిటైర్డ్​ ఉపాధ్యాయురాలు బంగారు దుకాణం వద్దకు రాగా గుర్తు తెలియని దుండగులు ఆమె పర్సును అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకున్నారు.

robbery at saluru in vizianagaram district
రిటైర్డ్​ ఉపాధ్యాయురాలి పర్సును దొంగిలించిన ఇద్దరు మహిళలు

By

Published : Jan 13, 2020, 8:45 AM IST

పర్సు దొంగలించిన మహిళల అరెస్టు

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఈనెల 10న బంగారు దుకాణం వద్ద జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మెంటాడ వీధిలో నివాసముంటున్న కోట సత్యవతి ఉపాధ్యాయురాలిగా పని చేసి 10 ఏళ్ల కిందట పదవీ విరమణ పొందారు. ఆమె తన మనవడి బారసాల కోసం బంగారు గొలుసును కొనుగోలు చేసేందుకు ఓ బంగారు దుకాణం వద్దకు వెళ్లారు. ఆమె వద్దనున్న రెండు పాత గొలుసులను తూకం వేయించి... షాప్ నుంచి బయటికి వచ్చేసరికి ఆమె పర్సు కనిపించలేదు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బంగారం దుకాణంలోని సీసీ కెమెరాలను పరిశీలించి దొంగలను పట్టుకున్నారు. అనంతరం వారి నుంచి పర్సును స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details