విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ వెనుకనుండి ఢీకొట్టిన లారీ నుజ్జు నుజ్జు అయింది. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. క్లీనర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ వాహనాలు రెండు ఉల్లిపాయలు లోడుతో భువనేశ్వర్ వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి సమీపంలోని సోలార్ ప్లాంట్ వద్ద అనంతపురం నుంచి రాయదుర్గం వైపు వెళ్తున్న బొలెరో వాహనం లారీని ఢీకొన్న ఘటనలో నరేంద్రన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందిన వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం గ్రామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.