భోగాపురం మండలం నారుపేట వద్ద జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్తుండగా లారీని తప్పించబోయిన కారు..డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరు విశాఖకు చెందిన వారుకాగా..ఇద్దరు శ్రీకాకుళానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. అనంతరం బోల్తాపడిన కారుని జేసీబీ సాయంతో పక్కకు తొలగించారు.
భోగాపురం జాతీయరహదారిపై కారు బోల్తా.. ముగ్గురికి స్వల్ప గాయాలు - road accidents in vizianagaram news
విజయనగరం జిల్లా భోగాపురం మండలం నారుపేట జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి బోల్తా పడింది. వాహనంలోని ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
రహదారిపై బోల్తా పడిన కారు