ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీని ఢీ కొట్టిన బొలెరో... యువకుడు మృతి - ROAD ACCIDENT NEWS IN VIZIANAGARAM

ఆగి ఉన్న లారీని బొలెరో వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా సీతానగరం మండలంలో జరిగింది.

లారీని ఢీ కొట్టిన బొలెరో... యువకుడి మృతి
లారీని ఢీ కొట్టిన బొలెరో... యువకుడి మృతి

By

Published : Dec 1, 2020, 3:59 PM IST

విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట గ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని అరటి గెలల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్ స్నేహితుడు మృతి చెందాడు. కొమరాడ మండలం కుమ్మరి కుంటకు చెందిన ప్రవీణ్.. తన స్నేహితునికి తోడుగా వెళ్లి ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. అతనికి 10 నెలల క్రితం వివాహమైంది. ప్రస్తుతం అతని భార్య నాలుగు నెలల గర్భిణి. భర్త చనిపోయాడని తెలిసిన ఆ గృహిణి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details