విజయనగరం జిల్లా శృంగవరపుకోట పందిరప్పన్న కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో... 16 మంది గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు బలంగా ఢీకొన్నాయి. ఆటోల్లో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఏడుగురు చిన్నారులే. వీరందరు విశాఖ జిల్లా డుంబ్రిగడకు చెందిన వారు. ఆధార్ నమోదు, సవరణల కోసం ఎస్.కోటకు వచ్చి... తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. క్షతగాత్రులకు ఎస్.కోట సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన మహిళలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
రెండు ఆటోలు ఢీ... 16 మందికి గాయాలు - s kota road accident news
విజయనగరం జిల్లా శృంగవరపుకోట పందిరప్పన్న కూడలి వద్ద రెండు ఆటోలు ఢీకొన్నాయి. ప్రమాదంలో 16 మంది గాయపడగా... ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
రెండు ఆటోలు ఢీ... 16 మందికి గాయాలు