విజయనగరం జిల్లా భోగాపురం మండలం మహారాజపేట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. స్వల్పంగా గాయపడ్డ వారిని విజయనగరంలోని మహారాజ జిల్లా కేంద్ర ఆసుపత్రికి, తీవ్రంగా గాయపడిన వారిని తగరపువలసలోని ఎన్ఆర్ఐకు తరలించారు. విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దర్శనం కోసం వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
ACCIDENT: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన వ్యాన్.. 10 మందికి గాయాలు - విజయనగరం తాజా వార్తలు
ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. దైవదర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
accident in Vizianagaram