విజయనగరం కార్పొరేషన్ మొదటి డిప్యూటీ మేయర్గా 13వ డివిజన్ కౌన్సిలర్ రేవతీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి.. మే 4వ తేదీన కరోనా కారణంగా మృతి చెందింది. ఆమె మరణంలో ఖాళీ ఏర్పడిన మొదటి డిప్యూటీ మేయర్ ఎన్నికను ఈ రోజు నిర్వహించారు.
ప్రత్యేక అధికారి.. సంయుక్త కలెక్టర్ కిశరో కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలో మొదటి డిప్యూటీ మేయర్గా రేవతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 36వార్డు కౌన్సిలర్ పద్మావతి.. రేవతిని మొదటి డిప్యూటీ మేయర్గా ప్రతిపాదించగా.. 21వ డివిజన్ కార్పొరేటర్ నాగవల్లి బలపరిచారు. ఈ క్రమంలో.. రేవతి మొదటి డిప్యూటీ మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఆమెకు ఎన్నిక ధృవీకరణ పత్రం అందచేశారు.