Concern of airport residents: గత ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం నిర్వాసితులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. అధికారులపై భోగాపురం విమానాశ్రయం నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్చేశారు. అనంతరం కలెక్టర్ సూర్యకుమారికి వినతిపత్రం అందచేశారు.
"గత ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఇవ్వలేదు.. ప్రతిపాదిత గ్రామాల నుంచి వలసపోయిన, 18సంవత్సరాల నిండిన యువకులకు పునరావాస గ్రామాల్లో ఇళ్లు కేటాయించలేదు.. పునరావాస కాలనీల్లోనూ పూర్తి వసతులూ కల్పించలేదు. అయినప్పటికీ అధికారులు ఉన్నఫళంగా గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు.. బడులనూ కూల్చివేస్తామంటున్నారు.. ఇదెక్కడి న్యాయం" అంటూ విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం నిర్వాసిత గ్రామాల ప్రజలు అధికారులపై మండిపడ్డారు. అధికారుల తీరుని నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు.