లాక్ డౌన్ అమలు చేసినప్పటి నుంచి నేటి వరకు ఏపీఎస్ ఆర్టీసీ అద్దెబస్సు డ్రైవర్లకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేశారు. విజయనగరం ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన చేశారు. ఎనిమిది నెలలుగా అద్దెబస్సులు రోడెక్కలేదని.. కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అద్దెబస్సు యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలని అద్దెబస్సు డ్రైవర్ల జిల్లా అధ్యక్షుడు జె.ఎస్.ఎన్ రాజు డిమాండ్ చేశారు. పనిలేని మొత్తం కాలానికి సగం జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. డ్రైవర్లందరికీ వైద్య పరీక్షలు చేయాలని, బస్సు పాసులు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.