భార్యతో గొడవపడి చిన్నారి మృతికి కారణమైన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆడపిల్లలంటే ఇష్టం లేకపోవడంతో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు. విడాకులు ఇవ్వమని భార్యను పదేపదే అడుగుతున్నట్లు తెలిపారు. భార్యపై కోపంతోనే పిల్లలను చంపడానికి సైతం వెనకాడలేదని చెప్పారు. తొమ్మిదో తేదీన ఈ ఘటన జరిగింది. అతణ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ అప్పలనాయుడు పేర్కొన్నారు.
జోడిమామిడివలసలో చిన్నారిని చంపిన తండ్రికి రిమాండ్ - విజయనగరం లేటేస్ట్ న్యూస్
విజయనగరం జిల్లా సాలూరు మండలం జోడిమామిడివలసలో భార్యతో గొడవపడి.. చిన్నారి మరణానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనలో రెండేళ్ల పాప మృతిచెందగా.. ఐదేళ్ల పాపకు తీవ్రగాయాలయ్యాయి.
Remand for father killed child in vijayanagaram