తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విజయనగరం పట్టణానికి మంచినీటి సరఫరా కోసం చేసిన కృషిని వివరిస్తూ.. రూపొందించిన కరపత్రాలను విజయనగరం అశోక్ బంగ్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అదితి గజపతి రాజు ఆవిష్కరించారు. తెలుగుదేశం మహానాడు సందర్భంగా రూపొందించిన ఈ కరపత్రాలను నియోజకవర్గంలో అన్ని వార్డు, గ్రామాల పార్టీ ప్రతినిధులకు అందజేశారు. ఈ కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విజ్జపు వెంకట ప్రసాద్, మద్దాల ముత్యాలరావు, కర్రోతు వెంకట నర్సింగరావు, కంది మురళీనాయుడు, మైలపల్లి పైడిరాజు, గొలగన సురేంద్ర, చిగురుపాటి కుటుంబరావు, సారిక వెంకటరమణ, గోళ్లకోట శివ, దుంప పూర్ణ, రొబ్బి సోంబాబు, చిప్పాడ స్వామి, వెంకటరావు పాల్గొన్నారు.
విజయనగరంలో తెదేపా అభివృద్ధిపై కరపత్రం విడుదల - Release of the pamphlet on the good done to Vijayanagaram
విజయనగరానికి తెదేపా చేసిన అభివృద్ధిని వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను నియోజకవర్గ ఇన్ఛార్జ్ అదితి గజపతి రాజు ఆవిష్కరించారు. ఈ కరపత్రాలను అన్ని వార్డు, గ్రామాల పార్టీ ప్రతినిధులకు అందించారు. ఈ కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేయనున్నారు.
విజయనగరానికి తెదేపా చేసిన మేలుల పై.. కరపత్రం రిలీజే